: 'ఓకే'... ఈ పదం వయసు 175 ఏళ్ళు!


'ప్రియా... రేపు పార్కుకు రాగలవా?' ఇది, ప్రియుడి ప్రశ్న!
'ఓకే, ప్రయత్నిస్తాను!' ఇది ప్రియురాలి జవాబు!
'శంకర్... ఆ ఫైళ్ళు కాస్త చూడు!' ఇది ఆఫీసులో బాస్ ఆదేశం.
'ఓకే సర్'... ఇది ఉద్యోగి జవాబు.
'రేయ్, ఇంటికి వచ్చేటప్పుడు బ్రెడ్డు తీసుకురా...!' ఓ నాన్న ఇలా చెబితే... తనయుడు బయటికి వెళుతూ 'ఓకే డాడ్'! అంటాడు.
ఇలా మనచుట్టూ బాగా పెనవేసుకుపోయిన పదం 'ఓకే'.

ఎప్పుడో 175 ఏళ్ళ క్రితం అమెరికాలోని 'బోస్టన్ మార్నింగ్ పోస్ట్' పత్రిక తొలిసారి ఈ పదాన్ని ప్రచురించింది. ఓకే పదంపై ఇల్లినాయిస్ కు చెందిన ఓ ఇంగ్లిష్ ప్రొఫెసర్ అలెన్ మెట్ కాఫ్ ఏమంటున్నారో వినండి. ఈ పదాన్ని పెరేడ్లు, ఉపన్యాసాలతో సెలబ్రేట్ చేసుకోవాలని సెలవిస్తున్నారు. ఇంత అద్భుతమైన పదం మరొకటి లేదన్నది ఆయన అభిప్రాయం.

ప్రపంచవ్యాప్తంగా పరికిస్తే 'కోక్' కంటే, చిన్నారుల తొలి పలుకు 'అమ్మ' కంటే కూడా 'ఓకే' అన్న పదమే ఎక్కువగా పలుకుబడిలో ఉందట. ఈ పదం 'ఓక్ అయే' (స్కాటిష్ భావన), గ్రీకు పదం 'ఒలా కలా' (ఇట్స్ గుడ్), 'ఆక్స్ కయేస్' (ఫ్రెంచ్ పదం) నుంచి రూపాంతరం చెంది ఉంటుందన్న వాదనలు లేకపోలేదు. అయితే, ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఆ వాదనలను కొట్టిపారేస్తోంది. 1830 నాటికి వాడుకలో ఉన్న 'ఓర్ల్ కరెక్ట్' అనే పదం నుంచి 'ఓకే' ఆవిర్భవించి ఉంటుందని చెబుతోంది.

  • Loading...

More Telugu News