: రాంపూర్ సంగతి మర్చిపోండి...బిజ్నూర్ ను అభివృద్ధి చేస్తా: జయప్రద
ఆర్ఎల్డీ పార్టీ తరపున బరిలోకి దిగిన ప్రముఖ సినీ నటి జయప్రద బిజ్నూర్ ను అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. రాంపూర్ లో ప్రత్యర్థి వర్గం నుంచి ఆమె తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. దీంతో రాంపూర్ నుంచి పోటీ చేస్తే ఓటమి పాలవుతాననే భయంతోనే జయప్రద బిజ్నూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారని, రాంపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఆమె చేసిందేమీ లేదని ప్రత్యర్థులు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే, పొత్తుల్లో భాగంగానే తాను బిజ్నూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నానని... నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని జయప్రద చెబుతున్నారు.