: నా విజయానికి ధోనీ సలహానే కారణం: అమిత్ మిశ్రా
వరల్డ్ టీ20లో సత్తా చూపిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా.. అదంతా ధోనీ పుణ్యమేనంటున్నాడు. బ్యాట్స్ మెన్ పై దాడి చేసినట్లుగా బౌలింగ్ ఉండాలని ధోనీ తనకు సూచించాడని.. ఆయన సలహాలు ఎంతో తోడ్పడ్డాయని చెప్పాడు. బ్యాట్స్ మెన్ ను ఎదుర్కొనే సత్తా తనకుందంటూ ధోనీ ప్రోత్సాహమిచ్చాడని తెలిపాడు. తానెప్పుడూ వికెట్లు తీసుకోవడంపైనే దృష్టిపెడతానని.. వికెట్లు తీసుకోకుండా బ్యాట్స్ మెన్ పరుగులను కట్టడి చేయడం వల్ల ఉపయోగమేమీ ఉండదని అభిప్రాయపడ్డాడు.