: బాలీవుడ్ లో నటిస్తానంటున్న అర్నాల్డ్ స్క్వార్జెనెగర్
హాలీవుడ్ సినిమాలో నటించాలన్నది ప్రతి ఒక్క భారతీయ నటుడి కల. కానీ, ఓ పాప్యులర్ హాలీవుడ్ నటుడు బాలీవుడ్ సినిమాలో నటిస్తానని చెబుతున్నాడు. ఆయనే అర్నాల్డ్ స్క్వార్జెనెగర్! ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ యాక్షన్ హీరో కొన్ని రోజుల కిందట ఓ పర్యావరణ సంబంధిత సమావేశంలో పాల్గొనేందుకు భారత్ వచ్చాడు. ఇదే క్రమంలో ఆగ్రాలో తాజ్ మహల్ ను సందర్శించేందుకు వచ్చిన ఆయనను బాలీవుడ్ లో నటిస్తారా? అని మీడియా ప్రశ్నిస్తే వెంటనే స్పందించాడు.
'హిందీ సినిమాల్లో భాగం కావాలని నాకూ ఉంది. మంచి స్క్రిప్టు, అభిరుచి గల దర్శకుడు దొరికితే తప్పకుండా నటిస్తాను. త్వరలోనే ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాను. కాగా, పలువురు భారతీయ నటులు కూడా హాలీవుడ్ లో తమదైన మార్క్ ను ఏర్పరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు' అని స్క్వార్జెనెగర్ చెప్పాడు.