: వారితో 'బ్యాడ్ బోయ్స్' తీస్తా: రోహిత్ శెట్టి
సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ లతో 'బ్యాడ్ బోయ్స్' సినిమా తీయాలని ఉందని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి తెలిపారు. కాఫీ విత్ కరణ్ జోహార్ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శెట్టికి... మీరు ఒకవేళ సల్మాన్, షారూక్ తో ఓ దీవిలో చిక్కుకుపోతే ఏం చేస్తారు? అన్న ప్రశ్న ఎదురైంది. 'ఏముంది... బ్యాడ్ బోయ్స్ సినిమా స్టార్ట్ చేస్తా'నంటూ సులువుగా సమాధానమిచ్చేశారు. పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్, వరుణ్ ధావన్ లకు మంచి భవిష్యత్తు ఉందని ఆయన చెప్పారు. జోయాఅక్తర్ తో కలసి రోహిత్ శెట్టి కాఫీ విత్ కరణ్ జోహార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ఆదివారం సాయంత్రం స్టార్ వరల్డ్ లో ప్రసారం కానుంది.