: పాపం... నామినేషన్ వేయలేకపోయిన నగ్మా


ఒకప్పుడు తన అంద చందాలతో తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన కథానాయిక నగ్మా లోక్ సభ బరిలోకి దిగుతోంది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేయాలనుకుని ముహూర్తం ఖరారు చేసుకుంది. తీరా నామినేషన్ వేయడానికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినా పని కాలేదు. జిల్లా కాంగ్రెస్ నేత సలీమ్ భారతి చేతిలో నామినేషన్ పేపర్లు ఉండగా... కలెక్టరేట్ వద్ద పోలీసులు ఆయన్ను లోపలకు అనుమతించలేదని నగ్మా తెలిపారు. నిబంధనల ప్రకారం నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్థి వెంట ఐదుగురికి మించి ఉండకూడదు. మరి ఆ సమయంలో ఎక్కువ మంది ఉన్నందువల్ల అనుమతించలేదా? లేక మరేదైనా కారణమా? తెలుసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు స్పందించలేదు. దీంతో శనివారం నామినేషన్ వేసే విషయమై కాంగ్రెస్ సీనియర్ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని నగ్మా మీడియాకు చెప్పారు.

  • Loading...

More Telugu News