: ఆశ్చర్యపరిచిన ధోనీ నిర్ణయం
సంప్రదాయ వ్యూహాలకు కట్టుబడే జట్టుగా టీమిండియాకు పేరు. అయితే పాకిస్తాన్ తో టి20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ లో కెప్టెన్ ధోనీ ఆ సంప్రదాయాన్ని పక్కనబెట్టాడు. తొలి ఓవర్ ను పేసర్ తో వేయించేందుకు బదులుగా స్పిన్నర్ అశ్విన్ కు బంతినిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న పాక్ ఓపెనర్ కమ్రాన్ అక్మల్ వికెట్ నష్టపోయి 5 ఓవర్లలో 22 పరుగులు చేసింది.