: పవన్ మోడీని కలవొచ్చు... నాకు మాత్రం విరోధే: చిరంజీవి వింత వాదం


తన తమ్ముడు పవన్ కల్యాణ్ బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలవవచ్చని కేంద్ర మంత్రి చిరంజీవి అభిప్రాయపడ్డారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ మోడీని కలవడంలో తప్పులేదని వెనకేసుకొచ్చారు. అయితే, పవన్ కల్యాణ్ సహా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వారెవరైనా తనకు రాజకీయ ప్రత్యర్థులేనని చిరు తెలిపారు. తమ్ముడు పవన్ కల్యాణ్ కు గట్టిపోటీ ఇస్తామని ఆయన తెలిపారు. పవన్ ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెడతాడో అక్కడ గట్టి అభ్యర్థులను బరిలోకి దించుతామని చిరంజీవి ప్రకటించారు. రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డే కారణమని చిరు ఆరోపించారు.

  • Loading...

More Telugu News