: బీజేపీ నేతలకు భద్రత కల్పిస్తాం: షిండే


ఉగ్రముప్పు నేపథ్యంలో బీజేపీ నేతలకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే హామీ ఇచ్చారు. రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం నేడు షిండేను కలిసింది. ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాద సంస్థ ఎన్నికల నేపథ్యంలో నేతల కిడ్నాప్ కు ప్రణాళికలు రచిస్తోందని మీడియాలో వచ్చిన కథనాలను వారు షిండే దృష్టికి తెచ్చారు. బీజేపీ నేతల భయాందోళనల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వారికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News