: మోడీని అభివృద్ధికి రాయబారిగానే పరిగణించండి: బీజేపీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని అభివృద్ధికి రాయబారిగా పరిగణించాలంటున్నారు బీజేపీ ఉపాధ్యక్షుడు ముఖ్తార్ అబ్బాస్ నక్వీ. మోడీని భయానికి చిహ్నంలా భావించరాదని ఆయన పేర్కొన్నారు. ఇక, ఈ ఎన్నికల్లో ముస్లిం వర్గానికి బీజేపీ సరైన ప్రాధాన్యం కల్పించలేదన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మైనారిటీలకు వాటిల్లిన అన్ని రకాల నష్టాలకు పరిహారం చెల్లిస్తుందని చెప్పారు.