: ఎస్పీ టిక్కెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత పోటీ
వచ్చే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నేత బూటా సింగ్ కాంగ్రెస్ కు రాంరాం చెప్పారు. సమాజ్ వాదీ పార్టీలో ఆయన చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజస్థాన్ లోని జెలోర్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. 1984 నుంచి 86 వరకు రాజీవ్ గాంధీ కేబినెట్ లో కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన బూటా సింగ్ 1962 నుంచి 2004 వరకు ఎనిమిది సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2006 వరకు బీహార్ గవర్నర్ గా కూడా చేశారు.