: రామయ్య పెళ్లి పనులు ప్రారంభం


భద్రగిరిపై అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 19న భక్త కోటి, ముక్కోటి దేవతల సమక్షంలో సీతమ్మను రామయ్య పెళ్లాడనున్నారు. ఇందుకోసం ఖమ్మం జిల్లా భద్రాచల క్షేత్రంలో పనులు మొదలయ్యాయి.

రోలు, రోకలికి దేవతలను ఆవాహనం చేసి పసుపు కొమ్ములను దంచుతారు. భక్తులు కూడా తలో చేయీ వేస్తారు. దీంతో పెళ్లి పనులు ప్రారంభమైనట్లు. 10 క్వింటాళ్ల బియ్యంతో ఈ రోజు స్వామివారికి తలంబ్రాలను కలుపుతారు. అనంతరం స్వామికి డోలోత్సవం నిర్వహిస్తారు. 

ఇప్పటికే వెయ్యి కిలోల తలంబ్రాలను ఆలయ సిబ్బంది సిద్ధం చేశారు. చలువ పందిళ్లు, నీటి వసతి, రోడ్లు శుభ్రం చేయడం, రంగులు వేయడం మొదలైన పనులను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News