: ఆ శకలాలు మునిగిపోయి ఉండొచ్చు: ఆస్ట్రేలియా ఉపప్రధాని
శాటిలైట్ చిత్రాల్లో వెలికిచూసిన శకలాలు మునిగిపోయి ఉండొచ్చని ఆస్ట్రేలియా ఉప ప్రధాని వారెన్ ట్రస్ అభిప్రాయపడ్డారు. మలేసియా విమానం ఆచూకీ కోసం భారీ ఎత్తున గాలిస్తున్న అంతర్జాతీయ బృందానికి హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఈ శకలాల జాడ కనిపించలేదని ఆయన చెప్పారు. పెర్త్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తొలుత తేలుతూ కనిపించిన అనుమానాస్పద శకలాలు, ఆ తర్వాత కనిపించలేదని వెల్లడించారు. బహుశా అవి నీటి అడుగుకు చేరి ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.