: నిజామాబాద్ నుంచి లోక్ సభకు కవిత?
తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె పేరు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆమె టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కవిత బరిలోకి దిగడం వాస్తవమేనని సమాచారం. ఇదే స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న మధుయాష్కీ మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేస్తారని వినికిడి.