: నీ బతుకు యూట్యూబ్ లో పెడతాం: షబ్బీర్ కు పవన్ అభిమానుల హెచ్చరిక
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై పవన్ అభిమానులు నిప్పులు చెరిగారు. ఏదైనా మాట్లాడే ముందు నిజాలు తెలుసుకోవాలని... ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. తిరుపతిలో ఈ రోజు పవన్ ఫ్యాన్స్ మీడియా సమావేశంలో ఈ హెచ్చరికలు జారీ చేశారు. "మీ ఇంటి కొస్తాం చూసుకుందామా?, లేక నీవే మా ఊరు వస్తావా?" అంటూ సవాల్ విసిరారు. నోరు మూసుకోకపోతే నీ బాగోతమంతా యూట్యూబ్ లో, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెడతామని షబ్బీర్ ను హెచ్చరించారు.