: పవన్ ఉద్వేగంగా ఉన్నారు: జేసీ


నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉద్వేగ భరితంగా ఉన్నారని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సినిమా గ్లామర్ తో ఓట్లు రాబట్టుకోవాలంటే అందరికీ సాధ్యం కాదని, అది ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యమైందని చెప్పారు. జగన్ ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, ఆయన ఎన్నికల హామీలపై స్పష్టత లేదనీ అన్నారు. ఫైళ్లపై సంతకాలు చేస్తానంటే గుడ్డిగా ఎవరూ నమ్మరన్నారు. చంద్రబాబు రుణ మాఫీని ప్రజలందరూ నమ్ముతున్నారని, మహిళలు కూడా టీడీపీ వైపే చూస్తున్నారని జేసీ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోయిందని, కాంగ్రెస్ కు 'ప్రస్తుత బస్సు యాత్రే... చివరి శవ యాత్ర' అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు మాస్క్ పెట్టి ఇంకా చూపుతున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News