: అండమాన్ జలాల్లో చైనా గాలింపు చర్యలకు 'నో' చెప్పిన భారత్


చైనా యుద్ధనౌకలు భారత ప్రాదేశిక సముద్ర జలాల్లో ప్రవేశించేందుకు కేంద్రం అనుమతి నిరాకరించింది. అండమాన్ సముద్ర జలాల్లో మలేసియా విమానం గాలింపు చర్యల్లో పాలుపంచునేందుకు తమ నావికాదళానికి చెందిన నాలుగు నౌకలకు అనుమతి ఇవ్వాలని చైనా నిన్న భారత్ ను కోరింది. ఈ విన్నపాన్ని భారత్ సున్నితంగా తోసిపుచ్చింది. అండమాన్, నికోబార్ కమాండ్ ఏళ్ళుగా భారత్ కు వ్యూహాత్మక సైనిక స్థావరంగా కొనసాగుతోంది. ఇప్పుడు చైనాను అనుమతిస్తే, మలక్కా జలసంధి నుంచి సిక్స్ డిగ్రీ చానల్ వరకు కొనసాగుతున్న భారత్ ఆధిపత్యానికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్నది రక్షణ రంగ నిపుణుల అంచనా.

  • Loading...

More Telugu News