: ఇప్పుడు పంపకాలేమీ జరగవు: కేసీఆర్
ఇప్పటికిప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య పంపకాలు జరగవని... కేవలం ప్రతిపాదనలు మాత్రమే తయారవుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులు వచ్చిన తర్వాతనే పంపకాలు జరుగుతాయిని తెలిపారు. చాలామటుకు పంపకాలు ఉభయుల అంగీకారం (మ్యూచువల్ అండర్ స్టాండింగ్)తోనే జరుగుతాయని... ఏకాభిప్రాయం కుదరని పక్షంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని తెలిపారు.
ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేదని కేసీఆర్ జోస్యం చెప్పారు. అందువల్ల వీలైనంత ఎక్కువ సీట్లను టీఆర్ఎస్ గెలుచుకోవాలని... అప్పుడు కేంద్ర ప్రభుత్వం మన మాట వింటుందని తెలిపారు.