: స్నోడెన్ తో పోటీ పడి గూగుల్ అవార్డు గెలుచుకున్న భారతీయుడు
ఒకవైపు అమెరికా అనైతిక నిఘా వ్యవహారాలను ప్రపంచం ముందు బయటపెట్టిన వీరుడు ఎడ్వర్డ్ స్నోడెన్. ప్రస్తుతం ఇతడు రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు. మరోవైపు ఓ భారతీయ జర్నలిస్టు శుభ్రాంశు చౌదరి. సీజీనెట్ స్వర వ్యవస్థాపకుడు. నెట్ తో సంబంధం లేకుండా మొబైల్ ఫోన్ల ద్వారా స్థానిక వార్తలను స్థానిక భాషలోనే వినడం, పంపడం ఈ సర్వీసు ప్రత్యేకత. ఛత్తీస్ గఢ్ లో శుభ్రాంశు దీన్ని ప్రారంభించాడు. గూగుల్ డిజిటల్ యాక్టివిజమ్-2014 అవార్డుకు వీరిద్దరితో పాటు మరెంతో మంది పోటీ పడగా.. అది శుభ్రాంశునే వరించింది. లండన్ లో నిన్న జరిగిన కార్యక్రమంలో అవార్డు విజేతలను ప్రకటించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను గుర్తిస్తూ గూగుల్ ఈ అవార్డును ఏటా అందిస్తూ వస్తోంది.