: దామోదరకు తెలిసినంత మాకు తెలియదా?: కేసీఆర్


కిరణ్ తన జిల్లాకు రూ. 7 వేల కోట్లు తరలించుకుపోతుంటే టీమంత్రులు ఏమీ చేయలేక పోయారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెబితే... గొర్రెల మందకు తోడేలు కాపలా కాసినట్టే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి గుండెకాయలాంటి సెక్రటేరియట్ లో 80-90 శాతం మంది సీమాంధ్ర ఉద్యోగులు ఉండటాన్ని దామోదర రాజనరసింహ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఆప్షన్లు ఉండరాదని, ఏపీ భవన్ తెలంగాణకే ఇవ్వాలని తాను అంటున్నానని... దీన్ని మీరు సమర్థిస్తారా? లేదా? అని నిలదీశారు. ఉద్యోగుల బదిలీలపై దామోదరకు తెలిసినంత మాకు తెలియదా? అని ప్రశ్నించారు.

పోలవరం దిగువ భాగంలోని నీటిని తెలంగాణ వారు వాడుకోలేరని... ఆ నీరు ఆంధ్రకు పోవాల్సిందేనని... దానిపై తమకు అభ్యంతరం లేదని... కాకపోతే డిజైన్ మార్చమని మాత్రమే అడుగుతున్నామని కేసీఆర్ చెప్పారు.

  • Loading...

More Telugu News