: సంపన్న యాచకురాలు ఇక లేదు


బాబూ ధర్మం చేయి అని నోరారా అడుగుతుంది ఆ అవ్వ. అంతమాత్రాన తనేదో నాలుగు మెతుకులకు దిక్కేలేని నిర్భాగ్యురాలు అనుకుంటే పొరపాటే. అవసరమైతే తిరిగి ఒకటికి పదిరెట్లు దానం చేయగల సంపన్న యాచకురాలు. ఆయుష్షులో సెంచరీ కొట్టిన ఈషా అనే ఆ అవ్వ సౌదీ అరేబియాలోని జెద్దాలో కన్నుమూసింది. 50 ఏళ్లుగా బిక్షాటనతోనే ఆమె జీవించింది. ఆమె ఆస్తి విలువ 10 లక్షల డాలర్లు ఉంటుందని అంచనా. మన కరెన్సీలో అయితే సుమారు 6కోట్ల రూపాయల పైమాటే. తన సంపదను పేదలకు పంచాలని ఈషా వీలునామాలో ఎప్పుడో రాసేసింది. కొద్దిగా ధనం కనిపిస్తేనే డాబుసరితో జల్సాలు చేసే నేటి తరం వారికి.. ఈ నిస్వార్థ యాచకురాలు నిజమైన స్ఫూర్తిప్రదాత.

  • Loading...

More Telugu News