: బీజేపీలో చేరిన నటి రక్షిత


దక్షిణాదిన పలు భాషల్లో నటించి ఆ తర్వాత వివాహం చేసుకుని పూర్తి స్థాయిలో సినిమాలకు దూరంగా ఉంటున్న నటి రక్షిత భారతీయ జనతా పార్టీలో చేరింది. నిన్న (గురువారం) బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో బీజేపీ నేతలు సదానంద గౌడ, అనంతకుమార్, మాజీ మంత్రి ఆర్.అశోక్ ల సమక్షంలో రక్షిత బీజేపీ తీర్థం పుచ్చుకుంది. భవిష్యత్తులో బీజేపీ నుంచి బయటికి వెళ్లాల్సి వస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని ఈ సందర్భంగా తెలిపింది. గతంలో బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన రక్షిత తర్వాత జేడీఎస్ లోకి జంపయింది. ప్రస్తుతం ఆమె కమలదళంలో చేరడం గమనార్హం.

  • Loading...

More Telugu News