: ఫ్లాట్లు తనకు అమ్మాలంటూ పొరుగువారిపై ఒత్తిడి తెస్తున్న అమీర్ ఖాన్!


'సత్యమేవ జయతే' కార్యక్రమంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజి సొంతం చేసుకున్న నటుడు అమీర్ ఖాన్. ఇప్పుడాయనపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ముంబయి బాంద్రా ప్రాంతంలోని పాలి హిల్స్ లో అమీర్ కు స్థలం ఉంది. అయితే, దానికిరువైపులా ఉన్న ఫ్లాట్లను తనకు అమ్మేయాలని ఇరుగుపొరుగువారిపై ఈ హీరో ఒత్తిడి తెస్తున్నట్టు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఓ కథనం వచ్చింది.

తానో విశాలమైన బంగ్లా నిర్మించుకోవాలన్నది అమీర్ ఉద్దేశమని సదరు కథనం ద్వారా తెలుస్తోంది. ఓ వృద్ధ మహిళ, ఆమె కుమార్తె తమ స్థలంలో 60 శాతం అమీర్ కు అమ్మాలని తమ హౌసింగ్ సొసైటీ కూడా ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News