: అనుమానాస్పద శకలాల వద్దకు చేరుకున్న నార్వే ఓడ
మలేసియా విమానం అదృశ్యం వ్యవహారం ఓ కొలిక్కివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి! దక్షిణ హిందూ మహాసముద్ర ప్రాంతంలో అనుమానాస్పద శకలాలు తేలియాడుతున్నట్టు శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఆ శకలాల వద్దకు నార్వేకు చెందిన ఓ నౌక కొద్దిసేపటి క్రితం చేరుకుంది. కార్లు రవాణా చేసే ఈ నౌక పేరు హో సెయింట్ పీటర్స్ బర్గ్. ఇది మడగాస్కర్ నుంచి మెల్ బోర్న్ వస్తుండగా, మార్గమధ్యంలో ఆస్ట్రేలియా అధికార వర్గాల విజ్ఞప్తితో శకలాల అన్వేషణకు బయల్దేరింది.
తమకు ఆస్ట్రేలియా వర్గాల నుంచి అభ్యర్థన అందిందని, ఎంత కాలం కావాలంటే అంత కాలం సహకారం అందిస్తామని నార్వే నౌక వర్గాలు తెలిపాయి. కాగా, సముద్రంలో తేలియాడుతున్న శకలాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.