: ఒంటరితనం వద్దు ... కలిసుండడమే ముద్దు!


ఒంటరితనం అన్నది ఎప్పుడూ మంచిది కాదు ... అందులోనూ వృద్ధాప్యంలో అసలే మంచిది కాదంటున్నారు శాస్త్రజ్ఞులు. వయసు పైబడుతున్న కొద్దీ నలుగురితోనూ కలిసి ఉంటేనే మంచిదని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు. ఇలా వృద్ధాప్యంలో ఒంటరిగా వుండే వాళ్ళు మరణానికి చేరువవుతున్నారట. బ్రిటన్లో తాజాగా జరిగిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది.

52 ఏళ్ళు పైబడిన 6500 మంది స్త్రీ పురుషుల జీవితాలను లండన్ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు ఏడేళ్ళ పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. వీరిలో అందరితోనూ కలిసి ఉంటూ, జీవితాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్న వారూ వున్నారు. అలా కాకుండా, కుటుంబం, స్నేహితులు అన్న వాళ్ళే లేకుండా ఒంటరి జీవితాలు గడుపుతున్న వారూ వున్నారు.

అధ్యయనం జరిపిన ఏడేళ్ళ కాలంలో 930 మంది మరణించగా, వీరిలో నా అన్న వాళ్ళు లేని ఒంటరి పక్షులే ఎక్కువగా ఉన్నారట. ఆనందంగా గడిపే వారితో పోలిస్తే 48 శాతం మంది ఒంటరి వృద్ధులు ముందుగానే మరణిస్తున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. కాబట్టి, వృద్ధాప్యంలో ఒంటరితనం అసలే వద్దు ... నలుగురితోనూ కలిసి ఉండడమే ముద్దు అంటున్నారు పరిశోధకులు!        

  • Loading...

More Telugu News