: పవన్ కల్యాణ్ ప్రసంగం టీవీలో చూడలేదు...పత్రికల్లో చదివాను బాగుంది: జయసుధ
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగాన్ని తాను టీవీలో చూడలేదని, పత్రికల్లో చదివానని సినీనటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ తెలిపారు. హైదరాబాదులో ఓ వస్త్రదుకాణం ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ స్టైల్ కు తగ్గట్టే మాట్లాడారని అన్నారు. ఏ పార్టీ ప్రజలకు మేలు చేస్తుందో ఆ పార్టీకే ఓటు వేయాలని ఆమె సూచించారు.
రానున్న ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిని అధిష్ఠానం చూసుకుంటుందని ఆమె తెలిపారు. తనకు ఎమ్మెల్యే కంటే ఎంపీగా పోటీ చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. ఎంపీగా అయితే నటిగా కొనసాగుతూ పదవికి కూడా న్యాయం చేయగలనని జయసుధ అభిప్రాయపడ్డారు.