: కేసీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కిరణ్


సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులెవరూ తెలంగాణలో పని చేయడానికి వీల్లేదని, ఎలాంటి ఆప్షన్లు ఉండవని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. 52వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షన్ ఉంటుందని చెప్పారు. చట్టంలో ఏముందో కేసీఆర్ తెలుసుకోవాలని సూచించారు. ఉద్యోగులకు అండగా తాముంటామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇక పోలవరంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా కిరణ్ కొట్టిపారేశారు. ప్రాజెక్టును ఆపేందుకు ఆయనెవరు? అని ప్రశ్నించారు. పోలవరానికి అనుమతులు అన్నీ కేంద్రం నుంచి వస్తాయని, ఇప్పటివరకు ప్రాజెక్టుపై రూ.4వేల కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. పోలవరం డిజైన్ కు ప్రత్యమ్నాయం లేదని మీడియా సమావేశంలో చెప్పారు. కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ ఎగువ రాష్ట్రమని, అయితే, మిగులు జలాల విషయంలో ఆ రాష్ట్రం నష్టపోతుందనీ అన్నారు.

  • Loading...

More Telugu News