: ఆత్మాహుతి దాడితో బాగ్దాద్ రక్తసిక్తం
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని ఓ కేఫ్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. గతరాత్రి ఈ కేఫ్ వద్ద ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడి టీవీలో ఓ ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తుండగా దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 46 మంది మరణించారని ఇరాక్ అధికారులు తెలిపారు. ప్రజలు సాకర్ మ్యాచ్ వీక్షణలో లీనమైపోగా, వారిమధ్యలో ప్రవేశించిన ఆత్మాహుతి దళ సభ్యుడు బెల్టుకు అమర్చిన బాంబును పేల్చాడు.