: ప్రజాభిప్రాయం మేరకే టీడీపీలో చేరుతున్నా: డీఎల్
ప్రజాభిప్రాయం మేరకే తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. టీడీపీ కోరితే కడప నుంచి పోటీ చేస్తానని చెప్పారు. జగన్ దోపిడీ దారుడని, సిద్ధాంతాలు లేని వ్యక్తి అని విమర్శించారు. ఆయనతో పని చేయడం ఎవరికీ కుదరదని విమర్శించారు.