: కేసీఆర్ మెప్పుకోసమే కేకే విమర్శలు: వీహెచ్
కేసీఆర్ మెప్పుకోసమే కేకే కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన కేకే అదే పార్టీని విమర్శించడం హాస్యాస్పదం అని అన్నారు. ఉద్యమంతో సంబంధంలేని వారిని పార్టీలో చేర్చుకుంటున్న టీఆర్ఎస్ నేతలు తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. టీఆర్ఎస్ నేతలు రోజూ ఎవరో ఒకరు పార్టీలో చేరుతున్నట్టు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని ఆయన విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు సీట్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని వీహెచ్ స్పష్టం చేశారు.