: కిరణ్ సన్నిహితుడి ఇంటిపై ఐటీ శాఖ దాడులు
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితుడు అమరేందర్ రెడ్డి నివాసంపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. అమరేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. అమరేందర్ రెడ్డికి నందరగిరి హిల్స్ లో ఖరీదైన భూమిని కారుచౌకగా కిరణ్ ధారాదత్తం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమరేందర్ రెడ్డిపై ఐటీ శాఖ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.