: పండుగ భారత్ ది.. జోరు 'చైనా'ది
ఆర్ధిక సంస్కరణలకు ద్వారాలు తెరిచిన తర్వాత చైనా పురోగామి పథంలో దూసుకెళుతోందన్నది జగమెరిగిన వాస్తవం. చిన్న, సన్నకారు, కుటీర పరిశ్రమలకు పెద్దపీట వేయడం ద్వారా జాతీయ తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది చైనా. ఇంతవరకు బాగానే ఉంది. చైనా భారీ ఎత్తున జరిపే వస్తూత్పత్తికి తగిన మార్కెట్ కావాలికదా. వందకోట్ల జనాభాతో పొరుగునే ఉన్న భారత్ సహజంగానే చైనాకు తగిన ఆదాయ వనరుగా కనిపించింది.
ఇంకేం.. ఆటబొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, సెల్ ఫోన్లు ఇలా ఒకటేమిటి అన్నిరకాల వస్తువులు భారత్ పై గుమ్మరించింది. అదే వరుసలో హోలీలో రంగులు చిమ్మడానికి ఉపయోగించే 'కలర్ గన్' లు, రంగులు, బెలూన్లను మన మార్కెట్ల మీదికి వదిలింది. దీంతో, భారతీయ చిరు వ్యాపారులు కుదేలైపోయారట.
ఎంతగా అంటే, చైనా దెబ్బకు ఒక్క ఉత్తర భారతంలోనే 8-10 లక్షల మందికి ఉపాధి కరవైందిట. వారంతా ఈ హోలీ సంబంధిత పరికరాలు తయారీతోనే పొట్టపోసుకుంటారు. అసోచామ్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.