: బాబు బాణానికి కేసీఆర్ విలవిల: రావులపాటి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంధించిన బీసీ రామబాణానికి కేసీఆర్ విలవిలలాడుతున్నారని రావులపాటి సీతారామారావు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ది రాజకీయ ఆరాటం అని అన్నారు. కేసీఆర్ కు అధికార దాహం పట్టుకుందని, అందుకే ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలను ప్రజలు విశ్వసించడం లేదని రావులపాటి స్పష్టం చేశారు.