: నటి, వీజే రియా చక్రవర్తిపై లైంగిక దాడికి యత్నం
నటి, వీజే రియా చక్రవర్తిపై ఓ ఆగంతుకుడు లైంగిక దాడి చేసేందుకు యత్నం చేశాడు. ఈ విషయాన్ని రియానే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించింది. నిన్న (బుధవారం) సాయంత్రం ఐదు గంటలకు ముంబైలోని తన అపార్ట్ మెంట్ లోకి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి వెనుకగా వచ్చి ఆలింగనం చేసుకున్నాడని, లైంగిక దాడికి ప్రయత్నించాడని చెప్పింది. అతని నుంచి తప్పించుకునేందుకు చాలా ప్రయత్నించానంది. వెంటనే పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల జనం రావడంతో ఆ వ్యక్తి తప్పించుకున్నాడని వివరించింది. తర్వాత ఖర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపింది.
ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, సీసీటీవీ పుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారని రియా చెప్పింది. తెలుగులో నిర్మాత ఎమ్ ఎస్ రాజు తొలిసారి దర్శకత్వం వహించి, తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన 'తూనీగ తూనీగ' చిత్రంలో రియా హోరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో ముంబై వెళ్లి ఎంటీవీ వీడియో జాకీగా చేస్తోంది.