: ఫలించని మోడీ మంత్రాంగం...రంగలోకి దిగిన చిన్నమ్మ
లోక్ సభ స్థానం కేటాయింపుపై గుర్రుగా ఉన్న బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీని బుజ్జగించేందుకు ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భోపాల్ నుంచి బరిలోకి దిగేందుకు అద్వానీ మొగ్గు చూపుతుండగా, ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న గాంధీనగర్ స్థానాన్నే ఆయనకు కేటాయించారు. దీంతో ఆయన అలకబూనారు. ఆయనను బుజ్జగించేందుకు మోడీ రంగంలోకి దిగారు. ఆయనను శాంతింపజేసేందుకు శతవిధాల ప్రయత్నించారు. అయినప్పటికీ అద్వానీ అలక వీడలేదు. మోడీ మంత్రాంగం ఫలించకపోవడంతో చిన్నమ్మ సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ రంగంలోకి దిగారు. అద్వానీతో చర్చలు జరుపుతున్నారు.