: ఇదే ఊపు టోర్నీలో కొనసాగేనా?


టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత్ తన ప్రాక్టీసును ఘనంగా ముగించింది. నిన్న బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో ఇంగ్లండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా 20 పరుగుల తేడాతో నెగ్గింది. తద్వారా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మెయిన్ డ్రా పోరుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ రాణించినా, వికెట్లు తీయడంలో బౌలర్లు విఫలమయ్యారు. అయితే, పరుగులు ఇవ్వకుండా ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయడంలో మాత్రం సఫలీకృతులయ్యారు.

ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ జట్టు విజయానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు ఓవర్లన్నీ ఆడినా 6 వికెట్లకు 158 పరుగులే చేసి ఓటమిపాలైంది.

  • Loading...

More Telugu News