: మోడీపై సచిన్ పోటీ...?
బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీకి వారణాసిలో ఎలాగైనా చెక్ పెట్టాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బలమైన అభ్యర్థిని బరిలో దింపడం ద్వారా మోడీ ప్రభంజనానికి అడ్డుకట్ట వేయాలనుకుంటున్న కాంగ్రెస్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వైపు దృష్టి సారించింది. ప్రజాకర్షణలో మోడీకి సచిన్ ఏమాత్రం తీసిపోడన్నది కాంగ్రెస్ వర్గాల భావన. ఇప్పటికే సచిన్ తో పార్టీ వర్గాలు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. అయితే, మోడీపై పోటీకి సచిన్ విముఖత ప్రదర్శించినట్టు సమాచారం. సచిన్ ఆమధ్య రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.