: బీజేపీతో పొత్తుతోనే అభివృద్ధి సాధ్యం: పయ్యావుల
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోబోతుందంటూ వస్తున్న వార్తలకు ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ బలం చేకూర్చారు. ఈ మేరకు మాట్లాడుతూ, బీజేపీతో పొత్తుతోనే అభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్నామని చెప్పారు. కాగా, టీడీపీలోకి వచ్చే నాయకులు టిక్కెట్లు ఆశించి రాకూడదన్నారు. ఇన్నాళ్లు పార్టీ జెండా మోసినవారికి న్యాయం జరగాలని కోరారు. జగన్ కు వ్యాపారం, దోపిడీ తప్ప పాలన గురించి తెలియదని ఎద్దేవా చేశారు.