: హిమాలయాలకు నయనతార


అందాల తార నయనతార ప్రస్తుతం ఆధ్యాత్మికతపై మనసు కేంద్రీకరించింది. ఈ క్రమంలో దేశంలోని పలు ఆలయాలను దర్శించుకుంటోంది. ఇటీవలే ఈ అమ్మడు హిమాలయాలకు కూడా వెళ్లిందట. రుద్రాక్ష మాల ధరించి అక్కడి పవిత్ర ఆలయాలను కాలి నడకనే వెళ్లి దర్శించుకుందట. దాంతో, మానసికంగా ఎంతో ప్రశాంతతను పొందుతోందట. జన్మతహ క్రిస్టియన్ అయిన నయన్ మూడేళ్ల కిందట చెన్నైలోని ఆర్య సమాజంలో హిందూ మతాన్ని స్వీకరించింది. అప్పటినుంచి మరింత భక్తి భావాలను అలవరుచుకుంటోంది.

  • Loading...

More Telugu News