: పన్ను చెల్లించని గ్రామీణాభివృద్ధి సంస్థ సీజ్


ఆస్తి పన్ను చెల్లించలేదంటూ గ్రేటర్ హైదరాబాదులోని గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని జీహెచ్ఎంసీ సీజ్ చేసింది. ఈరోజు రాజేంద్రనగర్ మున్సిపల్ సర్కిల్ లోని సంస్థ కార్యాలయానికి మున్సిపల్ కార్పొరేషన్ తాళాలు వేసింది. కోటి రూపాయల వరకు ఆస్తి పన్ను చెల్లించలేదంటూ గతంలో గ్రామీణాభివృద్ధి సంస్థకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. అయితే, నిధులు లేకపోవడంతో సంస్థ అధికారులు ఆస్తిపన్ను చెల్లించలేదు. ఈ నేపథ్యంలో సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News