: ఎన్నికల బరిలో ఒకే కుటుంబం నుంచి ఐదుగురు


ఒకే కుటుంబం నుంచి ఐదుగురు సభ్యులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ సభ్యులే కావడం విశేషం. ఇబ్రహీంపట్నంలోని ఆంగ్లిస్ట్ స్కూలు యజమాని నీల్ల చెన్నయ్య కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు వార్డు కౌన్సిలర్లుగా పోటీ పడుతున్నారు. చెన్నయ్య 1వ వార్డు నుంచి, భార్య ఆండాలు 15వ వార్డు నుంచి, 4,13 వార్డుల నుంచి కుమార్తెలు భానురేఖ, భానుప్రియ బరిలో ఉన్నారు. 20 వ వార్డు నుంచి అల్లుడు శ్రీధర్ బాబు పోటీ చేస్తున్నాడు. ఇలా ఒకే కుటుంబం నుంచి ఐదుగురు పంచాయతీ ఎన్నికల బరిలో నిలబడడం నిజంగా విశేషమే కదూ!

  • Loading...

More Telugu News