: నిరవధికంగా వాయిదాపడిన శాసనసభ
రాష్ట్ర శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. అంతకు ముందు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. దాంతోపాటే, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. కాగా, విద్యుత్ సమస్యపై సరైన సమాధానం ఇవ్వకుండా సభను వాయిదా వేయడంపై టీడీపీ.. సర్కారును తప్పుబట్టింది.