: పింఛనును 700 రూపాయలకు పెంచుతా: జగన్
వృద్ధులు, వితంతువులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛనును రూ. 200 నుంచి 700 రూపాయలకు పెంచుతానని, వికలాంగులకు పింఛనుగా వెయ్యి రూపాయలిస్తానని జగన్ హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ‘జనభేరి’లో భాగంగా రాజమండ్రి రోడ్ షోలో జగన్ మాట్లాడారు. అధికారంలోకి వస్తే పింఛన్ల ఫైలు మీదే తాను రెండో సంతకం చేస్తానని ఆయన అన్నారు. పింఛన్ సరిగా అందడం లేదని పలువురు జగన్ తో అన్నప్పుడు, ప్రతి నెలా ఒకటో తేదీన పింఛను అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. మరో రెండు నెలలు ఓపిక పడితే, తాను అధికారంలోకి వచ్చి అన్నింటినీ చక్కదిద్దుతానని జగన్ భరోసా ఇచ్చారు.