: ఒక్క రోజే పదిన్నర కోట్లు స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున నగదు స్వాధీనం అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో భారీ ఎత్తున నగదు స్వాధీనమైంది. లెక్కాపక్కా లేకుండా వ్యానులో తీసుకెళ్తున్న ఆరున్నర కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘజియాబాద్ జిల్లాలో నాలుగు వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ శివహరి మీనా తెలిపారు.
మొదట్లో వ్యానులో ఉన్నవి నాలుగు కోట్ల రూపాయలే అని భావించినా వ్యాను వెనుక భాగంలో మరో రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి. పట్టుబడిన నగదు గురించి వ్యాను డ్రైవర్ ఏమీ చెప్పకపోవడంతో అధికారులు ఆదాయపుపన్ను శాఖకు ఆ మొత్తాన్ని అప్పగించారు. మరో రెండు వాహనాల నుంచి 26 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారిలో మరో వాహనం నుంచి 4.12 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.