: అమరుల ఆత్మీయ సమ్మేళనంలో గందరగోళం
హైదరాబాదులోని అంబర్ పేటలో ఏర్పాటు చేసిన అమరుల ఆత్మీయ సమ్మేళనంలో గందరగోళం నెలకొంది. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సమ్మేళనంలో వేదికపై అమర వీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ పాల్గొన్నారు.
అమరవీరుల కుటుంబాలకు ఈ ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలంటూ ఓయూ జేఏసీ డిమాండ్ చేసింది. అమర వీరుల కుటుంబాలకు ఎన్నికల్లో నిలిచే అవకాశం కల్పించాలని విద్యార్థి నేతలు సభలో నినాదాలు చేయటంతో సభ ఉద్రిక్తంగా మారింది.