: ఏదో ఒకరోజు మంచి పుస్తకం రాస్తా: కరీనా


బాలీవుడ్ నటి కరీనాకపూర్ పుస్తకాలపై తెగ ఆసక్తి చూపిస్తోంది. ఈ విషయంలో తన అక్కను అనుసరిస్తోంది. ఇప్పటికే కరిష్మా కపూర్ ఓ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. అయితే, ఏదో ఒక రోజు తాను కూడా మంచి పుస్తకం రాస్తానని వెల్లడించింది. ఇటీవల ముంబయిలో కరీనా ఓ పుస్తక ఆవిష్కరణకు హాజరైంది. ఈ సందర్భంగా, మీకు సినిమా కథ లేదా పుస్తకం రాసే ఆలోచన ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, 'సినిమా కథపై నాకు అంతగా ఐడియా లేదు. కానీ, ఏదో ఒక సమయంలో ఓ పుస్తకం రాసే అవకాశం ఉంది' అని పేర్కొంది.

  • Loading...

More Telugu News