: టీడీపీలో చేరికలు ‘లడ్డూబాబు మేకప్’ వంటివే: వాసిరెడ్డి పద్మ


తెలుగుదేశం పార్టీలో చేరికలు ‘లడ్డూబాబు మేకప్’ వంటివేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఆర్భాటం చూస్తుంటే బాధ కలుగుతుందని ఆమె అన్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఏం సాధించారని ఆమె సూటిగా ప్రశ్నించారు. కనీసం టీడీపీ ప్రజా సమస్యలపై సరిగ్గా పోరాడలేకపోయిందని అన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంద్రలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా నూకలు చెల్లాయని పద్మ చెప్పారు. దాంతో ఆ పార్టీలోని వారంతా ఇప్పుడు టీడీపీలో చేరుతున్నారని ఆమె అన్నారు. ఈ చేరికలన్నీ టీడీపీ బలం అనుకుంటే పొరపాటని, ఇది ‘లడ్డూబాబు‘ సినిమాలో అల్లరి నరేష్ మేకప్ వంటిదేనని పద్మ చెప్పారు. ఈ చేరికలన్నీ బలుపు కాదు వాపేనని వాసిరెడ్డి తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News