: పెయిడ్ న్యూస్ పై నిఘా: ఎన్నికల కమిషన్


సాధారణ ఎన్నికల్లో పెయిడ్ న్యూస్ పై నిఘా పెడుతున్నట్లు ఎన్నికల కమిషన్ అధికారి అక్షయ్ రౌత్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఈరోజు అధికారులు మీడియాతో సమావేశమయ్యారు. పెయిడ్ న్యూస్ పై మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నిఘా పెడుతుందని అక్షయ్ తెలిపారు. సామాజిక మాధ్యమంలో ప్రకటనల పైనా ఎంసీఎంసీ నిఘా పెడుతుందని ఆయన చెప్పారు. ఎన్నికల నిర్వహణకు మీడియా సంస్థలు సహకరించాలని ఆయన కోరారు. పోలింగ్ కు 48 గంటల ముందు నుంచి పార్టీలకు అనుకూలంగా ఇంటర్వ్యూలు, చర్చలు ప్రసారం చేయకూడదని అక్షయ్ అన్నారు.

  • Loading...

More Telugu News