: ముప్పై ఏళ్ళుగా ఆ రాష్ట్రానికి హైకోర్టు లేదట!


త్రిపుర.. భారత దేశ ఈశాన్య రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న ఏకైక రాష్ట్రం. అయితే, గత 30 ఏళ్ళుగా త్రిపురకు హైకోర్టు లేదట. త్రిపురతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా హైకోర్టులు లేక కేసుల పురోగతి మందగిస్తున్న నేపథ్యంలో కేంద్రం హైకోర్టుల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో, నేడు త్రిపుర హైకోర్టును లాంఛనంగా ప్రారంభించింది. అక్కడి ప్రజల ముప్పై ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమాస్ కబీర్ త్రిపుర హైకోర్టును ప్రారంభించారు.

ఈ సందర్భంగా, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ మాట్లాడుతూ, మూడు దశాబ్దాల ఆకాంక్ష నేడు నెరవేరిందని వ్యాఖ్యానించారు. కాగా, జస్టిస్ కబీర్ నిన్న మేఘాలయ హైకోర్టు, మణిపూర్ హైకోర్టులను ప్రారంభించారు. తాజాగా, త్రిపుర హైకోర్టుతో భారత్ లో హైకోర్టుల సంఖ్య 24కి చేరింది. ఇప్పటివరకు త్రిపురకు చెందిన కేసులను గౌహతి హైకోర్టుతో పాటు, అగర్తల బెంచ్ పరిష్కరించేవి. 

  • Loading...

More Telugu News