: కిరణ్ ను కలసిన శైలజానాథ్
మాజీ మంత్రి శైలజానాథ్ జేఎస్పీ అధినేత కిరణ్ ను కలిశారు. జేఎస్పీ ఉపాధ్యక్ష పదవిని శైలజానాథ్ కు కట్టబెట్టినప్పటికీ... ఆయన మాత్రం టీడీపీలో చేరే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిరువురి భేటీ ఆసక్తికరంగా మారింది. అయితే తాను మర్యాద పూర్వకంగానే కిరణ్ ను కలిశానని శైలజానాథ్ చెప్పారు.